
కాంగ్రెస్ ఎమ్మెల్సీ వ్యవహారంలో రేవంత్ సర్కారుకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు విషయంలో ప్రభుత్వ స్టాండెంటో చెప్పాలని ఆదేశించింది. తీన్మార్ మల్లన్నపై కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈనెల 21 లోపు వివరణ ఇవ్వాలంటూ సిద్దిపేట పోలీసులకు, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొన్ని రోజులుగా రెడ్డి సామాజిక వర్గాన్ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. హన్మకొండ బహిరంగ సభలో రెడ్లు బీసీల ఉచ్చ తాగాలని కామెంట్ చేశారు. రెడ్లు దొంగలని.. తెలంగాణను దోచుకుంటున్నారని అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సంఘం నేతలు ఆందోళనలు చేశారు.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై యాక్షన్ తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయితే ఎక్కడా పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో సిద్దిపేటకు చెందిన రవీందర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కోర్ట దృష్టితి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. తీన్మార్ మల్లన్నపై ఎందుకు కేసు ఫైల్ చేయలేదో చెప్పాలని సిద్దిపేట పోలీసులతో పాటు ప్రభుత్వ స్టాండ్ చెప్పాలని ఆదేశించింది.