తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. శ్రీవారి దర్శనానికి వెళ్తానన్న మాజీ సీఎం జగన్ ను డిక్లరేషన్ అడగడం కాక రాజేసింది. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు జగన్. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది. తిరుమల వెళ్లడం ఇష్టం లేకే జగన్ ఆంక్షల పేరుతో వాయిదా వేసుకున్నారని మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో జగన్ ను టార్గెట్ చేస్తూ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవే ఇప్పుడు ఆమెకు శాపంగా మారాయి. సోషల్ మీడియాలో అనితను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఆమె చేసిన మాటలను పోస్ట్ చేస్తూ అనితకను కడిగిపారేస్తున్నారు వైసీపీ ఫాలోవర్స్.
హోం మంత్రి అనిత తిరుమలకు వెళ్ళినపుడు డిక్లరేషన్ ఇచ్చారా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.గతంలో టీడీపీ బోర్డులోకి తీసుకుని.. తర్వాత ఎందుకు రద్దు చేశారని అడిగారు. తాను క్రిస్టియన్ అని అనిత బహిరంగంగా చెప్పిన విషయాన్ని గుడివాడ ప్రస్తావించారు. తన ఇంట్లో, కారులో, చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుందని అనిత చెప్పారని గుర్తు చేశారు.ఆమె క్రైస్తవ మత విశ్వాసాన్ని కలిగి ఉంటే తప్పు లేదని ఎవరి వ్యక్తిగత ఆరాధన వారివి అని గుడివాడ అన్నారు. మతాన్ని రాజకీయం చేయడం తమకు ఇష్టం లేదని.. అయితే కూటమి నేతల తీరు వల్లే తాము అనిత డిక్లరేషన్ గురించి అడుగుతున్నామని అమర్నాథ్ చెప్పారు.
హోం మంత్రిగా అయ్యాక శ్రీవారిని దర్శించుకున్న అనిత.. డిక్లరేషన్ ఇచ్చారా ప్రశించారు.వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూడా అనితను ప్రశ్నించారు. ఆమె డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ ని అడగడం ఏ మేరకు సబబు అన్నారు.జగన్ తొలిసారి తిరుమలకు రాలేదని ఇప్పటికి పది సార్లకు పైగా వచ్చి ఉంటారని అన్నారు. ఐదు సార్లు వైఎస్సార్.. మరో అయిదు సార్లు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. మొత్తంగా జగన్ విషయంలో అత్యుత్సాహంగా మాట్లిడిన అనిత… అడ్డంగా బుక్కైపోయారనే టాక్ వస్తోంది.