క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను మట్టికరిపించిన కూటమిలో లుకలుకల మొదలయ్యాయి. ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. టీడీపీ, బీజేపీ కలిసి ఏ కార్యక్రమాలు చేయడం లేదు. తాజాగా టీడీపీ, జనసేన మధ్య వార్ స్టార్ అయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం లోపిస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు జనసేనను పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. కొన్ని నియోజక వర్గాల్లో జనసేనను ఎలా వదిలించుకోవాలా అని తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారు.
కృష్ణా జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గుడివాడలో టీడీపీ, జనసేన మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లో జనసేన దిమ్మెను టీడీపీ బీసీ నాయకుడు దారా నరసింహారావు నేతృత్వంలో కూల గొట్టడానికి ప్రయత్నించారు. ఈ విషయం తెలిసి జనసేన కార్యకర్తలు భారీగా అక్కడికి తరలి వెళ్లారు. తమ పార్టీ దిమ్మెను ఎందుకు కూలగొట్టాలని అనుకుంటున్నారని టీడీపీ నేతల్ని నిలదీశారు.
Read More : ICUలో తమ్ముడికి రాఖీ కట్టి చనిపోయిన అక్క..కన్నీళ్లు పెట్టించే ఘటన
టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకుల మధ్య వాగ్వాదం పెరిగి, ఒక దశలో కొట్టుకునే వరకూ వెళ్లింది. టీడీపీ దాడిని నిరసిస్తూ జనసేన శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగారు. జనసేన దిమ్మెను కూలగొట్టడానికి ప్రయత్నించిన నరసింహారావును టీడీపీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమపై దాడిగా భావిస్తున్నామని జనసేన కార్యకర్తలు అన్నారు. టీడీపీ నేత నరసింహారావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. జనసేన దిమ్మెను కూలగొట్టడానికి రావడంపై పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు.టీడీపీతో తాడోపేడో తేల్చుకోవాలనే యోచనలో గుడివాడ జన సైనికులు ఉన్నారంటున్నారు. చూడాలి మరీ ఈ వివాదం ఎక్కడివరకు వెళుతుందో..