క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత నాలుగు నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత. ఆమె బెయిల్ కోసం కేసీఆర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. కేటీఆర్, హరీష్ రావు పలుసార్లు ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో చర్చలు జరిపారు. బెయిల్ అంశంపై చర్చించారనే వార్తలు వచ్చాయి. అదే సమయంలో కవితను జెలు నుంచి విడిపించేందుకు కేటీఆర్, హరీష్ రావులు బీజేపీ పెద్దలతో బేరాలు నడిపారనే ప్రచారం సాగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, నేతలు పదేపదే ఇదే ఆరోపణలు చేస్తున్నారు. తన సోదరి ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జైలులో ఎమ్మెల్సీ కవిత బోరున విలపించారని తెలుస్తోంది. తన పరిస్థితి, తన కుటుంబ పరిస్థితిని గుర్తు చేసుకుని కవిత కన్నీళ్లు పెట్టారని సమాచారం.
దేశమంతా రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇక చెప్పనవసరం లేదు. అక్కా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నారు. రకా బంధన్ పండుగ వస్తే మాజీ సీఎం కేసీఆర్ ఇళ్లు సందడిగా ఉండేది. కేసీఆర్ కు తన ఆరుగురు సోదరులు వచ్చి రాఖీ కట్టేవారు. ఇక కవిత తన సోదరుడు కేటీఆర్ తో పాటు మరో సంతోష్ కు రాఖీ కట్టేది. రాఖీ పౌర్ణమి రోజు రోజంతా మీడియాలో కవిత, కేటీఆరే స్పెషల్ అట్రాక్షన్ గా ఉండేవారు. కాని ఈ సారి సీన్ మొత్తం రివర్స్ అయింది. కేసీఆర్ నివాసం పూర్తిగా బోసిపోయింది.
Read More : టార్గెట్ పవన్.. జనసేన దిమ్మెపై టీడీపీ దాడి!
కవిత జైలులో ఉండటంతో కేసీఆర్ ఫ్యామిలీ అంతా ఆ బాధలోనే ఉండిపోయింది. తన సోదరి రాఖీ కట్టే పరిస్థితి లేకపోవడంతో కేటీఆర్ కూడా లోలోపల కుమిలిపోతున్నారని అంటున్నారు. ఇక జైలులో ఉన్న కవిత.. తీవ్ర ఆవేదనలో ఉన్నారని తెలుస్తోంది. అన్నను తన కుటుంబాన్ని తలుచుకుని ఏడ్చారని సమాచారం. తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని కవిత కన్నీళ్లు పెట్టుకున్నారని అంటున్నారు. గత 15 ఏళ్లలో ఒకటి రెండు సార్లు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు తప్పిస్తే ఎప్పుడూ కేటీఆర్ కు కవిత రాఖీ కట్టకుండా ఉండలేదు.ఇక జైలులో ఉన్న కూతురు కవితను ఇంతవరకు చూసిరాలేదు కేసీఆర్. ఈ విషయంలో ఆయనపై విమర్శలు వస్తున్నా మనసు మార్చుకోవడం లేదు. కాని రాఖీ పౌర్ణమి రోజున కేసీఆర్ కూడా కూతురు లేని లోటుతో తీవ్ర మనో వేధనకు గురవుతున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.