తెలంగాణహైదరాబాద్

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ.. థియోటర్ అద్దాలు ధ్వంసం

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన‌ మూవీ దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా హంగామా నడుస్తోంది. అర్థరాత్రి సినమా టియేటర్ల దగ్గర జూనియర్‌ ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం నెలకొంది. దేవర ప్రీమియర్‌ షోలులకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ బారులు తీరారు. సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ యాక్టింగ్‌తో అదరగొట్టారని, కొన్ని సీన్లు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయని నెట్టింట ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంర్వెల్‌ థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌, అనిరుధ్‌ బీజీఎం అదిరిపోయాయంటున్నారు ఫ్యాన్స్‌. హీరోయిన్‌ జాన్వీని పాటలకే పరిమితం చేశారని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

కడప నగరంలో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హల్‌చల్‌ చేశారు. అర్థరాత్రి రాజా థియేటర్‌కు పోటెత్తిన అభిమానులు..టికెట్లు లేకుండా థియేటర్‌లోకి ప్రవేశించారు అభిమానులు. దీంతో థియేటర్‌ యాజమాన్యం, అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో థియేటర్‌ యాజమాన్యం షోను మధ్యలోనే నిలిపివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button