ఆంధ్ర ప్రదేశ్
Trending

జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్‌ను వెలేసిన నందమూరి ఫ్యామిలీ!

నందమూరి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్‌ను పూర్తిగా దూరం పెట్టిందా? నారా చంద్రబాబు ఫ్యామిలీ కూడా జూనియర్ ను పక్కన పెట్టేసిందా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తైంది. ఈ 50 ఏళ్ల వేడుకను నందమూరి ఫ్యామిలీ, బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు అతిరథ మహారథులను ఆహ్వానించారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ఉద్దండులు బాలయ్య వేడుకకు ఆహ్వానం అందుకున్నారు. కానీ నందమూరీ ఫ్యామిలీకే చెందిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు మాత్రం పిలుపు రాలేదు. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

బాలయ్య బాబు 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఫిలిం ఇండస్ట్రీ ఘనంగా నిర్వహించాలని డిసైడైంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ ఒకటో తేదీన సాయంత్రం వేడుకలు జరపనున్నారు.రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితోపాటు.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, అమితాబ్ లాంటి ప్యాన్ ఇండియా సినీ ప్రముఖులు, యువ హీరోలను ఆహ్వానిస్తున్నారు. అయితే సొంత కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు మాత్రం ఆహ్వానాలు అందలేదని తెలుస్తోంది. వాళ్లిద్దరిని దూరం పెట్టాలని ఉద్దేశ్యంతోనే పిలవలేదని అంటున్నారు.

Back to top button