ఏలూరు జిల్లా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రెచ్చిపోయాడు. తనకు వ్యతిరేకంగా స్టోరీ వేసిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్టును టార్గెట్ చేశాడు. గత కొన్ని రోజులుగా జర్నలిస్టును ఎమ్మెల్యే అనుచరులు బెదిరిస్తున్నారు. జర్నలిస్టు సంగతి తేలుస్తామంటూ సోషల్ మీడియాలో ఓపెన్ గానే పోస్టులు పెట్టుకున్నారు. చెప్పినట్లుగా బరి తెగించారు. సోమవారం సాయంత్రం జీ తెలుగు న్యూస్ జర్నలిస్టు దుర్గాప్రసాద్ యాదవ్ ను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు వెంబడించారు. కళ్లలో కారం చల్లి దాడికి ప్రయత్నించారు. మా సార్ పై వార్త వేస్తావా అంటూ బైక్ ని వెంబడించి కారం చల్లారు ఇద్దరు గుర్తుతెలియని యువకులు. జర్నలిస్టు దుర్గా ప్రసాద్ గట్టిగా కేకలు వేయడంతో ఎమ్మెల్యే అనుచరులు వదిలేసి వెళ్లిపోయారు.
కొయ్యలగూడెంలో జరిగిన ఈఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. జీ తెలుగు న్యూస్ ఛానల్ రిపోర్టర్ దుర్గాప్రసాద్ పై దాడి ఘటనపై జర్నలిస్ట్ సంఘాల నిరసనలు తెలుపుతున్నాయి. పోలవరం డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. గత రాత్రి కొయ్యలంగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్ దుర్గాప్రసాద్. తనపై దాడి చేసిన వారిని గుర్తించి వారి వెనక ఎవరి ప్రోద్బలం ఉందో విచారించి తనకు ప్రాణహాని జరగకుండా చూడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ దుర్గాప్రసాద్.
పవన్ కల్యాణ్ మాట పట్టించుకోని జనసేన ఎమ్మెల్యే అంటూ ఇన్నర్ రిపోర్ట్ వార్త ప్రసారం చేసింది జీ తెలుగు న్యూస్. ఈ కథనానికి పోలవరం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. నిజం నిక్కచ్చిగా వార్త వేశారని ప్రజలు అభినందించారు. ఇది జీర్ణించుకోలేని జనసేన ఎమ్మెల్యే .. తనపై వార్త రాసిన జర్నలిస్టును టార్గెట్ చేసాడు.జీ తెలుగు న్యూస్ కథనంపై పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఓవర్ యాక్షన్ చేశారు. నాపై వార్త వేసిన రిపోర్టర్ దొరికితే అంతు చూస్తా అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే. జర్నలిస్ట్ దుర్గాప్రసాద్ పై ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి జరిగినట్లుగా ఆధారాలు లభించాయి. తమ రిపోర్టర్ దుర్గాప్రసాద్ కు అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేసింది జీ తెలుగు న్యూస్ యాజమాన్యం.
మరోవైపు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు తీరుపై జనసేన నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. తమ నాయకుడు పవన్ కల్యాణ్ కు ఇబ్బందులు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. దుర్గాప్రసాద్ ఇచ్చిన కథనం నిజమేనని.. గెలిచిన పది రోజులపై ఎమ్మెల్యే వసూళ్ల దందా తెరిచాడని జనసేన కార్యకర్తలే చెబుతున్నారు. గ్రామానికో ఇద్దరు, ముగ్గురిని పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు. వసూళ్లు చేసే యువకులే జర్నలిస్టుపై దాడికి తెగబడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. జనసేన చీఫ్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని.. పోలవరం ఎమ్మెల్యేను కంట్రోల్ చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్