క్రైమ్ మిర్రర్, ఆన్లైన్, డెస్క్ : రూ. లక్ష జీతం ఉన్న వాళ్లకు రుణమాఫీ కట్ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ కోవలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు ఇతర ఉన్నత అధికారులకు కూడా రుణమాఫీ వర్తించదని స్పష్టం చేశారు. మొత్తం రాష్ట్రంలో 17వేల ఖాతాలు ఇలా లక్ష రూపాయలు వచ్చేవారి వి ఉన్నాయని తెలిపారు. 18వ తేదీన 11.50 లక్షల మంది రైతులకు రూ. లక్ష రుణమాఫీ అవుతుందని. రెండో దఫా ఆగస్టు 15 నాటికి అవుతుందని తెలిపారు. తెల్ల కార్డు లేకున్నా అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ వర్తించేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
678 Less than a minute