Monday, February 23, 2026
Homeతెలంగాణజిట్టాను చూసి బోరున విలపించిన రాణిరుద్రమ

జిట్టాను చూసి బోరున విలపించిన రాణిరుద్రమ

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, యువజన సంఘాల నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. జిట్టా అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. తమ అభిమాన నాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిట్టా బాలకృష్ణా రెడ్డి మరణంతో భువనగిరి నియోజకవర్గంలో విషాదం అలుముకుంది.

జిట్టాకు నివాళి అర్పించేందుకు పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చారు. ఉద్యమ నేతకు ఘనంగా నివాళి అర్పించారు. జిట్టాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కొందరు ఉద్యమకారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జిట్టా భౌతికదేహాన్ని చూసి బోరున విలపించారు బీజేపీ నాయకురాలు రాణిరుద్రమ. జిట్టాతో కలిసి యువ తెలంగాణ పార్టీ స్థాపించారు రాణిరుద్రమ. ఇద్దరూ కలిసి చాలారోజుల ఒకే వేదికతో రాష్ట్రమంతా తిరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిట్టా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. రాణిరుద్రమ మాత్రం బీజేపీలోనే కొనసాగించారు. సుదీర్ఘ కాలం జిట్టాతో కలిసి రాజకీయంగా పయనించిన రాణిరుద్రమ.. ఆయన మరణాన్ని తట్టుకోలేక కన్నీళ్లు కార్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments