ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారం వెంటనే అందించాలని సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా జగన్ అక్రమ ఆస్తులు విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. జగన్ అక్రమాస్తుల కేసు గురించి రెండు వారాల్లో గా పూర్తి వివరాలు సమర్పించాలని కోరింది.
మొత్తంలో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ చాలా లేట్ అవుతుందని టిడిపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ జగన్ కి సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసు విచారణ అనేది మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన పిటిషన్ లో కోరారు. తాజాగా ఇవ్వాలా ఈ కేసు పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేసుల విషయంలో ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారని న్యాయవాదుల పై ధర్మాసనం మండి పడింది. పెండింగ్లో ఉన్న కేసు వివరాలను మాకు తెలియజేస్తే దానికి తగిన ఆదేశాలు వెంటనే ఇస్తాం కదా అని న్యాయవాదులను పలు రకాలుగా ప్రశ్నించింది. ఇక తదుపరిచారులకు ఈనెల 13వ తారీకు దాకా వాయిదా వేసింది.