
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ సర్కార్ వాయిదా వేసింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని మెుదట నిర్ణయించగా నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో పరీక్షల తేదీలను మార్చింది. డీఎస్సీ పరీక్షలు జులై 18నుంచి ఆగస్టు 5వరకు ఉండటం వెంటనే గ్రూప్-2పరీక్షలు ఉండడంతో అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పలు ధర్నాల అనంతరం పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి :
- రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డికి ట్విటర్ వేదికగా కేటీఆర్ కౌంటర్..
- విద్యుత్ బకాయి బిల్లు చెల్లించమంటే అధికారిపై దాడి.. కేసు నమోదు!!
- శంకర్‌పల్లి 8వ వార్డులో ఫ్రైడే- డ్రైడే కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్..
- వ్యక్తిగత కారణాలతో సీపీఐ నేత రాయల చంద్రశేఖర్ ఆత్మహత్య…
- ప్రజా పాలన దరఖాస్తుదారులకు ఎడిట్ ఆప్షన్…