కేసీఆర్ కట్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి రేవంత్ రెడ్డి దండం పెట్టలేదని హరీష్ రావు విమర్శించారు. 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం చూడకుండా తాళాలు వేశారని చెప్పారు. ఎగవేతల రెడ్డి అంటే తనపైన కేసులు పెట్టారని..బిఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెడితే ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదని తెలిపారు. ప్రతిరోజు సోషల్ మీడియా వారిపై కేసులు పెడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి తప్పుడు విధానాలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు హరీష్ రావు.రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గాయన్నారు. ఇంటికి అనుమతులు ఉంటే కూలగొట్టమని ప్రభుత్వం అంటోంది..ఎవరిని వదలం అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. అసలు ప్రభుత్వం ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదన్నారు. బిఆర్ఎస్ క్యాడర్ మొత్తం యాక్టివ్ అయిందన్న హరీష్ రావు.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గోల్ కొట్టేది బిఆర్ఎస్ పార్టీనే అని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి హిట్ వికెట్ కాకుండా సెల్ఫ్ గోల్ కాకుండా చూసుకోవాలని హితవు పలికారు.
పాదయాత్రకు తామురెడీగా ఉన్నాం.. రేవంత్ రెడ్డి గన్ మెన్ లు లేకుండా రావాలని హరీష్ రావు సవాల్ విసిరారు. టిప్పు ఖాన్ బ్రిడ్జి నుండి పాదయాత్ర స్టార్ట్ చేద్దామని చెప్పారు. రాష్ట్రంలో అందరు రోడ్లు ఎక్కుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ తుగ్లక్ చర్యని మండిపడ్డారు.జీవో 29ను మేధావులు,విద్యా వేత్తలు సైతం తప్పు పట్టారన్నారు. అసలు జీవో 55ను రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. జీవో 29 వలన బీసీ,ఎస్సి,ఎస్టీలకు అన్యాయం జరుగుతుందన్నారు హరీష్ రావు. రీజినల్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం మార్చిందన్నారు.35 వేల కోట్ల రాష్ట్ర నిధులతో రీజినల్ రింగ్ రోడ్డు నార్త్ పార్ట్ ను చేపడుతున్నారని విమర్శించారు.
మేము దామగుండం ఇవ్వలేదు కాబట్టి మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ ఇవ్వలేదన్నారు హరీష్ రావు. బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో 4 లక్షల 26 వేల కోట్ల అప్పులు చేస్తే.. రేవంత్ పది నెలల్లోనే 85 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. అప్పులపై రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ గౌరవాన్ని తగ్గించారని..రేవంత్ రెడ్డి మాట్లాడితే పిల్లలు చెడిపోతారని టీవీలు బంద్ చేస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎం మాటలు వినిపిల్లలు పరీక్షల్లో రాస్తారని తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
రేవంత్ రెడ్డి మాట మీద నిలబడే రకం కాదన్నారు హరీష్ రావు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా ఎంపీగా నిలబడ్డారని విమర్శించారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట తప్పారు..రేషన్ కార్డు నిబంధన పెట్టి రుణమాఫీ కోత పెట్టారు..31 రకాల సాకులతో రుణమాఫీ ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. ఆరు మంత్రిపదవులు నింపడానికి రేవంత్ రెడ్డికిహై కమాండ్ నుండి అనుమతి రావడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్,చీఫ్ విప్ ను పెట్టుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేకుండా పోయిందని సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ భిక్ష అన్న హరీష్ రావు..కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి పొంతన ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మూడు సార్లు ఓడిపోయింది కాంగ్రెస్ పని అయిపోయినట్లేనా…? రాహుల్ గాంధీ ఎక్స్పైరి మెడిసిన్ అయినట్లేనా…? అన్నారు. కేసీఆర్ అంటే ఫైటర్,త్యాగశీలి.. ముందు నీ పక్కన ఉన్న వాళ్ళు నిన్ను ఫినిష్ చేయకుండా చూసుకో అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు హరీష్ రావు. నీ కుర్చీని ఎవరు గుంజుకుంటారో అని నీకు భయం ఉంది..ఇప్పుడు ఎన్నికలు వస్తే బిఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు వస్తాయి..ఒక మంత్రి గవర్నర్ ను కలిసి వచ్చాడు..మరో మంత్రి హెలికాప్టర్ కోసం అలిగారు..ఇంకో మంత్రి ఢిల్లికి వెళ్లి వచ్చారు.. ఇంకొంతమంది కాబోయే ముఖ్యమంత్రులమనిసోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారని విమర్శించారు.
తన పాలనలో రేవంత్ రెడ్డికి పోలీసులపై నమ్మకం లేదన్నారు హరీష్ రావు. స్పెషల్ పోలీసులను తీసివేసి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులను తెచ్చుకున్నారన్నారు. సీఎం ఇంటి చుట్టూ,సెక్రటేరియట్ చుట్టూ,మంత్రులకు రక్షణ ఇచ్చే స్పెషల్ పోలీసులను మార్చిస్పెషల్ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు హరీష్ రావు. తప్పులను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి నాపైన,కేటీఆర్ పైన అక్రమ కేసులు పెట్టాలని అనుకుంటున్నారని విమర్శించారు. కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు
కాబట్టి కక్ష కట్టారని హరీష్ రావు అన్నారు.