ఖమ్మం జిల్లాలో విషాదం జరిగింది. కూసుమంచి మండల కేంద్రంలో క్రికెట్ ఆడుతూ యువకుడు చనిపోయాడు. అప్పటివరకు హుషారుగా క్రికెట్ ఆడిన యువకుడు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోవడంతో అంతా షాకయ్యారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా కూసుమంచి లో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. క్రికెట్ లో బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా విజయ్ కుప్ప కూలిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు తెలిపారు.విజయ్ వయసు కేవలం 22 సంవత్సరాలు.
విజయ్ కుటుంబం ఇరవై సంవత్సరాల క్రితం చెన్నై నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి కూసుమంచి లో స్థిరపడ్డారు.అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన విజయ్ గుండెపోటు తో మృతి చెందడంతో తోటి మిత్రులు విషాదం లో మునిగిపోయారు.