తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తన మార్క్ పాలన చూపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కీలక ప్రాజెక్టుకు అనుమతి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన అటవీ అనుమతులను కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ మంజూరీ చేసింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర అటవీశాఖ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ కైలాష్ భీమ్ రావ్ భవర్, ఐఎఫ్ఎస్ లేఖ రూపంలో తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పంపిన లేఖలో రీజినల్ రింగ్ రోడ్డు (ఉత్తర భాగానికి) కు ప్రధాన సమస్యగా ఉన్న అటవీ భూములకు సంబంధించిన అనుమతులను ఇస్తూ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం 26.07.2024 తేదీన పంపించిన FP/TG/ROAD/489876/2024 ఆన్‌లైన్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు అటవీ సంరక్షణ చట్టం-1980 లోని సెక్షన్ ‘2’ ప్రకారం పరిశీలించడమే కాకుండా కేంద్రప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టం-1980 చట్టం క్రింద ఏర్పాటు చేసిన అటవీ సంరక్షణ చట్టం-2023 లోని నియమం 10 క్రింద ఏర్పాటు చేసిన రీజినల్ ఎంపవర్డ్ కమిటీ (REC) అనుమతులను మంజూరీ చేసినట్లు మంత్రి ఈ మేరకు తెలియజేశారు.
19 సెప్టెంబర్ 2024 న జరిగిన 69వ సమావేశంలో REC ఈ అంశాన్ని చర్చించిన తరువాత, రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన అదనపు పత్రాలను పరిశీలించి, ఈ ప్రతిపాదనకు అటవీ సంరక్షణ చట్టం-1980 లోని సెక్షన్ ‘2’ క్రింద “ఇన్-ప్రిన్సిపల్” అనుమతిని మంజూరు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిందని మంత్రి వివరించారు. ఈ అనుమతుల ప్రకారం మెదక్ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, మరియు యాదాద్రి-భువనగిరి జిల్లాలో 8.511 హెక్టార్లు మొత్తంగా మూడు జిల్లాల్లో కలిపి 72.3536 హెక్టార్ల అటవీ భూమిని భారత్‌మాల పరియోజన ఫేజ్-1 కింద ఎన్.హెచ్.ఏ.ఐ క్రింద పీఐయూ (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) గజ్వేల్, ప్రయోజనార్థం హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (HRRR) నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు లేఖలో తెలిపారని మంత్రి తెలియజేశారు. అందుకు సంబంధించిన వివిధ నిబంధనల అమలుకు అనుగుణంగా అటవీ అనుమతులు లోబడి భూసేకరణ చేస్తామని పర్యావరణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్లు మంత్రి తెలిపారు. అటవీ అనుమతుల సమస్య తీరడంతో ఇక ఎన్.హెచ్.ఏ.ఐ వద్ద పెండింగ్ లో ఉన్న టెక్నికల్ అప్రూవల్ వస్తే.వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుందని మంత్రి వివరించారు.
ఇప్పటిదాక 90 శాతం భూసేకరణ పూర్తయ్యిందని.. కొన్ని చిన్న చిన్న కోర్టు కేసుల భూములను త్వరలో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపిన మంత్రి.. ఇప్పుడు అటవీ అనుమతులు రావడం పట్ల హర్షంవ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్