క్రైమ్

కొత్త ఏడాది… కొత్త మోసాలు !… జాగ్రత్త?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : మనదేశంలో నిత్యం ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన భారతదేశవ్యాప్తంగా కొన్ని వేల మంది సైబర్ మోసాలకు గురై కొన్ని కోట్లలో డబ్బును పోగొట్టుకున్నారు. ప్రతిరోజు కూడా పోలీసులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పినా కూడా ప్రజలు ఏమాత్రం సరిగా పట్టించుకోవట్లేదు. కాబట్టి నిత్యం కేటుగాళ్లు అమాయక ప్రజల ని మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఈ సంవత్సరం కు ఇది చివరి రోజు కావున కొంతమంది కేటుగాళ్లు న్యూ ఇయర్ ని ఆసరాగా తీసుకొని కొత్త మోసాలకు పాల్పడేటువంటి అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తున్నారు.

Also Read :  ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం.. ఇంటింటికి వెళ్లి అందచేస్తున్న చంద్రబాబు

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు, డిస్కౌంట్లు, ఓటీపీలు,ఆఫర్లు, ఫ్రీ ఈవెంట్ పాస్ లు మరియు APK ఫైల్స్ లాంటివి మీ మొబైల్ ఫోన్లకు పంపి మీ సమాచారాన్ని హ్యాక్ చేసేటువంటి అవకాశం ఉందని తెలిపారు. తద్వారా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు అంతా కూడా సులభంగా కేటుగాళ్లు నొక్కేసేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. కొత్త ఏడాది శుభాకాంక్షలు అంటూ లింకులు ఏమైనా మీ మొబైల్ ఫోన్స్ కు వస్తే వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలని పోలీసులు కోరారు. ఇప్పటికే ఎన్నో విధాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసు అధికారులందరూ కూడా సైబర్ మోసాలు పట్ల జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో చెప్తున్నారు. కానీ కొంతమంది తెలియని అమాయక ప్రజల నుండి ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు నొక్కేశారు. కనుక తెలియని వ్యక్తుల నుండి వచ్చేటువంటి ఏ లింకులైన అసలు ఓపెన్ చేయకండి అని పోలీసులు హెచ్చరించారు.

 

ఇవి కూడా చదవండి : 

  1. రాత్రికి ఫుల్లుగా తాగుతారా.. అయితే ఈ రూల్స్ చదువుకోండి.
  2. గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
  3. బన్నీకి బెయిల్ ఇవ్వొద్దు అంటూ కోర్టును కోరిన పోలీసులు!
  4. ఏడాది చివరి రోజు కూడా హైడ్రా కూల్చివేతలు.. ఆందోళనలో బాధితులు
  5. ట్రెండింగ్ లో GOOD BYE… 2024!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button