విజయవాడ పెను గండంలో పండింది. గత మూడు రోజులుగా వరదలోనే ఉంది విజయవాడ. దాదాపు 3 లక్షల మంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. వరద ఇంకా తగ్గకముందే మరో ప్రమాదకర ఘటన జరిగింది. ప్రకాశం బ్యారేజీ గేట్లు ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ కి కొట్టుకు నాలుగు భారీ బోట్లు కొట్టుకువచ్చాయి. బోటు బలంగా ఢీకొట్టడంతో 70వ గేటు పూర్తిగా ధ్వంసం అయింది. వరద ఎక్కువ ఉండటంతో కొట్టుకెళ్లిపోయినయి బ్యారేజ్ ఐదు గేట్లు.
ప్రకాశం బ్యారేజీ కి వస్తున్న భారీ వరద నీరు. సోమవారం ఉదయానికి 11,13,826 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా ఉంది. బ్యారేజ్ మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. రెండవ హెచ్చరిక అమలులో ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద అంత కంతకు వరద పెరుగుతోంది.
ప్రకాశం బ్యారేజ్ వద్దకు ఏగువ ప్రాంత మత్యకారుల పడవలు, మర బొట్లు కొట్టుకువస్తున్నాయి.
విజయవాడలో 2.76 లక్షల మంది వరద బాధితులు ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో 2.76లక్షల మంది వరద బాధితులు ఉన్నారని, వీరందరికీ ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. బుడమేరుకు గండ్లు పడి వరదనీరు పోటెత్తిందన్నారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు భారీ వర్షాలు పడ్డాయన్నారు. శ్రీశైలం, సాగర్, పులిచింతల నుంచి, మున్నేరు, బుడమేరు నుంచి కూడా భారీగా వరదనీరు వస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు వెళ్లాల్సిన నీరు విజయవాడకు చేరుతున్నాయి. బుడమేరు నిర్వహణను జగన్ ప్రభుత్వం ఐదేళ్లపాటు పట్టించుకోలేదని.. గండ్లు పడిన ప్రాంతాల్లో మరమ్మతులు చేయలేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి వరద పరిస్థితి వివరించామన్నారు.ఆరు హెలికాప్టర్లు, 40 పవర్ బోట్లు, పది ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు పంపిస్తామని అమిత్ షా చెప్పారని చంద్రబాబు తెలిపారు. అడిగిన వెంటనే కేంద్రం సాయం చేసేందుకు ముందుకొచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి వివరించారు.