Uncategorized

కొండా సురేఖ సేఫ్.. నాంపల్లి కోర్టుకు హీరో నాగార్జున

మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసుపై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపున సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. హీరో నాగార్జునను కోర్టుకు వాంగూల్మం ఇవ్వాలని కోర్టు సూచించింది. నాగార్జునతో పాటు సాక్షుల వాదనలు రికార్డ్ చేయాలని లాయర్ అశోక్ రెడ్డి కోర్టును కోరారు. కోర్టు అందుకు సమ్మతించింది. దీంతో రేపు నాంపల్లి కోర్టుకు హాజరై స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు హీరో నాగార్జున. ఇటీవలే సమంత విషయంలో కేటీఆర్ తో పాటు హీరో నాగార్జునపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మంత్రి కొండా సురేఖ. దీనిపై నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. పరువు నష్టం దావాతో పాటు కొండా సురేఖపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు హీరో నాగార్జున.

మరోవైపు నాగార్జున- సమంతపై వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపిన మంత్రి కొండా సురేఖ సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖను పదవి నుంచి తొలగిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే అలాంటిదేమి ఉండదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కొండా సురేఖపై యాక్షన్ తీసుకునే ఆలోచనలో హైకమాండ్ లేదని తెలుస్తోంది. కొండా బీసీ వర్గం కావడంతో ఆమె విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ మెత్తబడినట్లు సమాచారం. సురేఖ పద్మశాలికాగా.. ఆమె భర్త మురళీ మున్నూరు కాపు సామాజికవర్గం. తెలంగాణలో ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి.కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే పార్టీకి నష్టం కలుగుతుందని హైకమాండ్‌ భావిస్తోందని చెబుతున్నారు. దాంతో ఆమెపై చర్యలకు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇష్యూలో నాగార్జున కుటుంబానికి కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన నేపథ్యంలో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్‌ స్టాప్‌ పెట్టేసినట్లు తెలుస్తోంది.

Spread the love
Back to top button