Uncategorized

కేసీఆర్, హరీష్ రావుకు అరెస్ట్ భయం!

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీశ్‌ రావు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయడం సంచలనంగా మారింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు నమోదు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయ పోరాటానికి దిగారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు కేసీఆర్, హరీశ్ కు గతంలో నోటీసులు ఇచ్చింది. దీనిపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భూపాలపల్లి కోర్ట్ నోటిసులు కొట్టివేయాలని తన పిటిషన్ లో కోరారు.

మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత జూలై 10న కేసీఆర్‌, హరీశ్‌రావులకు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ తాజాగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కేసీఆర్‌ ప్రభుత్వమే కారణం అంటూ సామాజిక కార్యకర్త భూపాలపల్లి కోర్టును ఆశ్రయించారు. ప్రజాధనం భారీగా దుర్వినియోగం అయినందున దీనిపై సమగ్ర విచారణ చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని తన పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. నోటీసులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button