క్రైమ్ మిర్రర్, మహేశ్వరం ప్రతినిధి : ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి లేదని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ,కిల మైసమ్మ ఆలయం దగ్గర చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు కాండించారు.ప్రోటోకాల్ వివాదాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ మెప్పు సోసమే ఆడుతున్న నాటకమని ఎద్దేవాచేశారు,గతంలో రావిర్యాలలో కులసంఘాల స్థలాల పట్టలు పంపిణీ చేసే కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చెర్మెన్ కంటేకార్ మధుమోహన్ ను చైర్మన్ అని చూడకుండా స్టేజి పై నుండి మీ అనుచరులు తోసేసినప్పుడు గుర్తుకురాలేద అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఒక న్యాయం వేరొకరికి మరొక న్యాయమా…?అని ప్రశ్నించారు గతంలో విద్యా శాఖ మంత్రి గా ఉన్న మీరే ప్రోటీకాల్ పాటించలేదు,దగ్గరుండి మరి సోద్యం చూసారు.నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని,కె ఎల్ ఆర్ ని అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానిస్తే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేతులు కట్టుకొని కూర్చోలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలోబోధ పాండురంగ రెడ్డి, కోటగాళ్ల రాజు కుమార్, సౌకుంట్ల యాదయ్య, గోవర్ధన్ రెడ్డి,కోటగాళ్ల రంజిత్ కుమార్, యాదయ్య,నారాయణ రెడ్డి,అర్జున్, సత్తయ్య, మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :