తెలంగాణ

కేసీఆర్ కు షాక్.. ముగ్గురు మాజీ మంత్రులు జంప్?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగలనుందా.. కీలక నేతలు జంప్ కొట్టబోతున్నారా.. అంటే పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం దిశగా రేవంత్ పావులు కదుపుతున్నారని.. దసరా లోపు ఇది జరిగే అవకాశం ఉందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. ఈ నేపథ్యంలోనే గులాబీ పార్టీలో తాజాగా జరిగిన ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ కు కీలక నేతలు హ్యాండ్ ఇస్తారనే టాక్ వస్తోంది.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గతంలో చక్రం తిప్పిన ఇద్దరు మాజీ మంత్రులు ఇప్పుడు మౌనం దాల్చారు. తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన బీసీ నేతల సమావేశానికి డుమ్మా కొట్టారు. కేటీఆర్ సమావేశానికి రావాలని తెలంగాణ భవన్ నుంచి పిలుపు వెళ్లినా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ రాలేదని తెలుస్తోంది. వీళ్లద్దరితో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా కేటీఆర్ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురు మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కూడా ఉన్నారు.ఈ ముగ్గురు బీసీ మాజీ మంత్రులు.. బీసీ సమస్యలకు సంబంధించి కేటీఆర్ నిర్వహించిన అత్యంత కీలక సమావేశానికి హాజరు కాకపోవడం చర్చగా మారింది.

కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలకంగా ఉన్న నేతలు.. సడెన్ గా సైలెంట్ కావడంతో గులాబీ కేడర్‌లో అయోమయం నెలకొంది. తలసాని, పద్మారావు గౌడ్ వారసులు కూడా కొంతకాలంగా ఎక్కడా కనిపించడం లేదు.గతంలో వీళ్లద్దరి వారసులు టికెట్ రేసులో నిలిచారు. తలసాని తనయుడు సాయి కిరణ్ యాదవ్ 2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. పద్మారావు గౌడ్ కొడుకు రామేశ్వర్ గత ఎన్నికల్లో పోటీ చేయాలని చూసినా కేసీఆర్ ఇవ్వలేదు. మాజీ మంత్రుల తాజా వ్యవహారంతో వాళ్లు పార్టీ మారేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button