జాతీయం

కేరళ పద్మనాభ స్వామి ఆలయంలో చోరీ?... దేవుడు ఆగ్రహించేనా!

కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం కలకలం రేపింది. తెలంగాణలోని అమ్మవారి విగ్రహ ధ్వంసం మరువకముందే మళ్లీ కేరళలోని ఆలయంలో దొంగతనం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే కేరళ లో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం అనేది ఎంతో ప్రసిద్ధమైనది. అయితే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు స్వామివారి పూజకు ఉపయోగించేటువంటి ఉరిలి అనే కంచు పాత్రను దొంగలించారు. అయితే ఈ పాత్రను దొంగలించినటువంటి వారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హర్యానాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. ఆ నలుగురులో ఒకడు ఆస్ట్రేలియా పౌరసత్వం కలిగిన వైద్యుడు అని విచారణలో గుర్తించారు. ఈ నలుగురు కూడా వారం ముందు క్షేత్రాన్ని అన్ని వైపులా సందర్శించారు. అన్ని కూడా బాగా గమనించిన తర్వాతే ఈ ఆలయ చోరీకి అనేది పాల్పడ్డారని వీళ్లు విచారణలో తేల్చి చెప్పారు.

అయితే ఆలయంలోని వస్తువులను దొంగ చేయడానికి వీళ్లకు మనసు ఎలా ఒప్పిందని ఈ నలుగురిని కూడా కఠినంగా శిక్షించాలని దేవాలయ అధికారులు అలాగే భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే హిందూ దేవాలయాలపై ప్రతి రాష్ట్రంలోనూ కూడా దొంగతనం లేదా ధ్వంసాలు అనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఇలా మరోసారి జరగకుండా చూసుకోవాలని చెప్తున్నారు.

Back to top button