Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్కేబుల్ టీవీలో నీలి చిత్రాలు..షాక్ అయిన ప్రజలు

కేబుల్ టీవీలో నీలి చిత్రాలు..షాక్ అయిన ప్రజలు

ఫ్యామిలీ మొత్తం కూర్చుని కేబుల్ టీవీలో సినిమా చూస్తున్నారు. సరదా సన్నివేశాలకు నవ్వుకుంటున్నారు. ఇంతలోనే ఎవరూ ఊహించనిది జరిగింది. అందరిని నిర్ఘాంతపరిచింది. గబగబా పరుగెత్తి టీవీ స్విచ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. కేబుల్ టీవీలో సినిమా మధ్యలో బ్లూ ఫిల్మ్ రావడంతో ఈ ఘటన జరిగింది. అందరిని షాక్ కు గురి చేసింది.

నంద్యాల – నందికొట్కూరులో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నడిచే ‘ఫిరోజ్ సిటీ కేబుల్’ నిర్వాహకులు ప్రైవేటుగా నీలి చిత్రాలు చూద్దామనుకున్నారు. అయితే ఆ వీడియోలను పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు. అంతే ఫిరోజ్ సిటీ కేబుల్ నెట్ వర్క్ ఉన్న అన్ని టీవీల్లో బ్లూ ఫిల్మ్ ప్లేయింది. దాదాపు 10 నిమిషాల పాటు నీలి చిత్రాలు ప్రదర్శితంఅయింది.

ఆ ఛానల్ పెట్టిన వందలాది మందికి అసభ్యకర దృశ్యాలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసి కేబుల్ టీవీ నెట్ వర్క్ రన్ చేస్తున్న ముగ్గురు యజమానులపై కేసు నమోదు చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments