తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంత కాలంగా చెబుతున్నట్లు బాంబ్ పేలబోతోంది. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు సర్కార్ రంగం సిద్దం చేసింది.కేబినెట్ సమావేశంలో నాలుగు గంటల పాటు జరిగిన చర్చలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశం ప్రధానమైనదని తెలుస్తోంది. ఈ కార్ రేస్ అంశం పై గవర్నర్ న్యాయ పరంగా అన్ని సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కోసం క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందున విచారణ నిమిత్తం సిఎస్.. ఏసీబీకి ఈరోజు లేదా రేపు కేసు అప్పగించే అవకాశం ఉంది.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్ రేస్ లో వారి స్వార్థం, స్వలాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ వాస్తవాలు తేలుస్తుందని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో స్వదేశీ డబ్బులు వేదేశాలకు ఏవిదంగా వెళ్లిందనే దానిపై..ఆర్ బీఐ పర్మిషన్ ఉందా అనే దానిపై , అగ్రిమెంట్ కంప్లిమెంట్ తరువాత పేమెంట్ చేసే అంశంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. పేమెంట్ కు అగ్రిమెంట్ కు తేడా ఉందని తెలుస్తోంది. ఏజెన్సీ కి కూడా నోటీసులు ఉంటాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల 700 కోట్ల రూపాయలు వచ్చాయని కేటీఆర్ చెబుతున్నారని.. అని ఎక్కడున్నయో తెలియాలన్నారు. భారీ ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరిగినయనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఉన్నారని తెలిపారు. అరవింద్ కుమార్ విచారణకు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది.