తెలంగాణ

కెసిఆర్ పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు…

 క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్: పవర్ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. పవర్ కమిషన్ చైర్మన్ గా  ఉన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడాన్ని ధర్మాసనం తప్పు పట్టింది. ఆయన స్థానంలో వెంటనే వేరే కొన్ని నియమించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతిసారి మాజీ సీఎంలపై కేసులు నమోదు చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని పిటిషన్ తరపు న్యాయవాది వాదించారు. ట్రిబ్యూనల్స్ ఉండగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయవిచారణ ఎలా చేస్తారని వాదనలు వినిపించారు. ఇందుకు స్పందించిన సుప్రీంకోర్టు పవర్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ను తప్పు పట్టింది. మధ్యాహ్నం వరకు కొత్త చైర్మన్ నియమించి తెలియజేయాలని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related Articles

Back to top button