తెలంగాణ

కూకట్‌పల్లిలో హైడ్రా బుల్డోజర్లు.. వందలాది భవనాలు నేలమట్టం

హైడ్రా మళ్లీ యాక్షన్ లోకి దిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. కొన్ని రోజుల నుంచి కూల్చివేతలు ఆపిన హైడ్రా, తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్లచెరువు మెుత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా.. 14 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు.

తెల్లవారుజాము నుంచే బుల్‌డోజర్ల తో అక్కడకు వెళ్లిన హై డ్రా అధికారులు, చెరువులో అక్రమంగా నిర్మించిన 16 షెడ్లు, నిర్మాణ దశలో ఉన్న రెండు అపార్ట్‌మెంట్‌లను డెమాలిష్‌ చేశారు. భారీ బందోబస్తు నడుమ, ముందు జాగ్రత్త చర్యలతో కూల్చి వేశారు. అయితే ప్రజలు నివసిస్తున్న అపార్ట్‌మెంట్లు, ఇళ్ల జోలికి వెళ్లకుండా నిర్మాణ దశలో ఉన్న వాటిని కూల్చేశారు. అయితే వ్యాపారం కోసం నిర్మించిన షెడ్లను నేలమట్టం చేశారు.

సంగారెడ్డి జిల్లా జిల్లా అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు సాగుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పటేల్ గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వే నెంబర్ 6, కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్‌లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించారు. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బిఆర్ఎస్ నేత నిర్మించారని తెలుస్తోంది.

తమ వ్యాపార సముదాయాలను కూల్చివేయనద్దని ప్రాధేయపడుతున్నారు వ్యాపారస్తులు. కనీసం తమకు సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.హైడ్రా అధికారులతో పాటు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు మహిళలు.

Back to top button