తెలంగాణ

కుల గణన సర్వే తుస్స్.. సీఎంను తిడుతూ తరమికొడుతున్న జనాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కులగణన సర్వే తుస్సుమంటోంది. ఘోరంగా విఫలమవుతోంది. సర్వే కోసం వెళ్లిన సిబ్బందికి జనాలు చుక్కలు చూపిస్తున్నారు. వివరాలు ఇవ్వడానికి ఏ మాత్రం ముందుకు రావడం లేదు. ప్రజా పాలనలో ఇచ్చిన సమాచారం ఎటు పోయింది.. మళ్లీ వచ్చారంటూ సర్వే కోసం అధికారులను నిలదీస్తున్నారు. కొందరైతే ఇంటిలోకి కూడా రానీయడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిని బండ బూతులు తిడుతూ తమను వెళగొడుతున్నారని సర్వే సిబ్బంది చెబుతున్నారు.

కుల గణనకు ప్రజల నుండి వ్యతిరేకత తీవ్రంగా వస్తోంది. ఆస్తి వివరాలు, లోన్ వివరాలు, రాజకీయ నేపథ్యం ఇలా 100కు పైగా ప్రశ్నలు ఉండడంతో ఏ మాత్రం సహకరించడం లేదు ప్రజలు. మా వ్యక్తిగత వివరాలు మీకు ఎందుకు చెప్పాలంటూ నిలదీస్తున్నారు. గతంలో తీసుకున్న ప్రజా పాలన దరఖాస్తులు ఏమయ్యాయి, ఆరు గ్యారంటీలు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇంటి ముందు సర్వే కోసం పెడుతున్న స్టిక్కర్లు పెట్టడానికి కూడా కొండరు ఇష్టపడటం లేదు.

సమగ్ర సర్వే కోసం వెళ్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుల గణన కోసం వస్తున్న వారిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు ప్రజలు.మా పర్సనల్ ఆస్తుల వివరాలు మీకు ఎందుకు చెప్పాలి.. రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీలు ఏమైనయి అంటూ అంటూ సీరియస్ అవుతున్నారని సర్వే కోసం వెళుతున్న సిబ్బంది చెబుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజాపాలన దరఖాస్తులు ఏమయ్యాయి.. మళ్ళీ ఎందుకు వచ్చారు అంటూ తిడుతున్నారు అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసున్నారు. కుల గణన కోసం పోతే రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చిన బూతులు తిడుతున్నారని కొందరు సిబ్బంది చెబుతున్నారు. ఏడాదిలో మాకు ఏమిచ్చాడు అంటూ నోటితో చెప్పలేని బూతులు లేడీస్ తిడుతున్నారని.. కుల గణన అని ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారని నిలదీస్తున్నారని చెబుతున్నార.

మరిన్ని వార్తలు చదవండి .. 

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్

ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి

టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్

20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ

ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లు.. ఎయిర్ పోర్టులో కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button