తెలంగాణ

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

మాగనూరు ఘటన లో పిల్లలు కుర్ కూరే లు తిని అస్వస్థతకు గురయ్యారని హైకోర్టుకు తెలిపారు ప్రభుత్వ అడిషనల్ అడ్వాకేట్ జనరల్. భాద్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దీంతో అధికారులు పై ఏమి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. మాగనూరు , కరీంనగర్ బురుగు పల్లి ఘటన పై నివేదిక ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఫుడ్ ఫాయిజన్ అయిన పాఠశాల్లో సాంపుల్ సేకరించి ల్యాబ్ కి పంపాలని ఆదేశించింది న్యాయ స్థానం. సోమవారం లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

అంతకుముందు మాగనూర్ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం కల్తీ ఘటన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం వ్యవధిలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. ఇది చాలా సీరియస్ అంశమన్న సీజే.. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా అని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమన్న హైకోర్టు..ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని మండిపడింది. ఈ సంఘటనపై వారంలో కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రశ్నించింది.

హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అన్న హైకోర్టు.. నాన్‌ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారని కామెంట్ చేసింది. అధికారులకు కూడా పిల్లలున్నారు కదా .. మానవతా దృక్వథతంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించండం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తోందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button