తెలంగాణరాజకీయం
Trending

కిషన్ VS మహేశ్వర్ రెడ్డి కమలంలో‌ దుమారం

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీలో నేతల వార్ తీవ్రస్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. కేంద్రమంత్రి, పార్టీ స్టేట్‌ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.కానీ ఈ మీటింగ్‌కు నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మినహా ఎవరు హాజరుకాలేదు. ఈ మీటింగ్‌ను బీజేఎల్పీ లీడర్‌ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లైట్‌ తీసుకున్నట్టు సమాచారం. మిగతా ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో బీజేఎల్పీ లీడర్‌ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా యాక్టివ్‌ అయ్యారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ను ఇరుకునపెట్టేలా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల సివిల్ సఫ్లై లో భారీ స్కామ్‌ జరిగిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ధరణిలో సమస్యలు, రైతు రుణమాఫీపై అనేకమార్లు ఆరోపణలు చేవారు.. ఇటీవల అసెంబ్లీలోనూ ప్రభుత్వాన్ని సక్సెస్‌ అయ్యారు. తాజాగా సుంకిశాల ప్రాజెక్టు కూలిపోవడంతో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి రాష్ట్ర సంపద దోచి పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ చేసిన అన్ని పనులపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టులన్నీ వెనక్కి తీసుకొని బ్లాక్​లిస్టులో పెట్టాలన్నారు. అటు సుంకిశాల ప్రాజెక్టు ఘటనకు ఆ సంస్థే బాధ్యత తీసుకోవాలన్నారు.

బీజేఎల్పీ లీడర్‌ ఏలేటి వ్యవహార తీరుపై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోందట. ప్రతి విషయానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇంతలా ఎందుకు రెచ్చిపోతున్నారని నేతలు ఆరా తీస్తున్నారట. ముఖ్యంగా మేఘా విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన తీరుపై కిషన్‌ రెడ్డి సీరియస్ అయినట్టు తెలిసింది. ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు చేయొద్దని క్లాస్‌ పీకినట్టు సమాచారం. అయితే ఒకరు ప్రభుత్వాన్ని ఇరుకునే పట్టే ప్రయత్నం చేస్తుంటే.. మరోకరు ఆధారాలు లేనిదే మాట్లాడొద్దని కామెంట్స్‌ చేయడంపై సొంత పార్టీలోనే చర్చోపచర్చలు జరుగుతున్నాయట. మొత్తంగా కమలం పార్టీలో ఇద్దరు నేతల మధ్య కోల్డ్‌వార్‌ తీవ్రస్థాయికి చేరుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంలో క్యాడర్‌ సైతం కన్ఫ్యూజ్‌కు గురవుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి సొంత పార్టీలోనే ఇద్దరు నేతల వివాదం ఎక్కడివరకు వెళుతుందో..

Back to top button