తెలంగాణ

కింగ్ ఫిషర్ బీరులో నలకలు.. మందుబాబుల ఆందోళన

తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా ధూంధాంగా తాగింది. విజయదశమని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు జనాలు. తిన్నంత తిని తాగినంత తాగి చిందేశారు. దసరా పండుగకు తెలంగాణలో లిక్కర్ సేల్స్ భారీగా పెరిగిపోయాయి. బతుకమ్మ నుంచి దసరా వరకు 10 రోజుల్లోనే దాదాపు వెయ్యి కోట్ల లిక్కర్ తాగేశారు జనాలు. పండుగ రోజు స్టాక్ అయిపోవడంతో చాలా వైన్స్ మధ్యాహ్నానికే మూసివేశారు. పలు ప్రాంతాల్లో మద్యం దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అయితే దసరా సేల్స్ ను క్యాష్ చేసుకునేందుకు నకిలీ లిక్కర్ సేల్ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. నాసిరకం మందును ఖరీదైన లిక్కర్ గా క్రియేట్ చేసి అమ్మెశారని తెలుస్తోంది. ఇక పలు ప్రాంతాల్లో మద్యం బాటిళ్లలో పురుగులు రావడం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గా వైన్ షాప్ దగ్గర కొనుగోలు చేసిన బీరులో చెత్త కనిపించింది. అందులో నలకలు ఉన్నాయి. బీర్ బాటిల్ లో నలకలు చూసిన మందుబాబు షాకయ్యాడు. షాపు యాజమాన్యాన్ని నిలదీశారు మందుబాబులు.

 

Back to top button