తెలంగాణ

కవితకు బెయిల్.. కేటీఆర్ ఫాంహౌజ్ కు బుల్డోజర్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : జన్వాడ ఫాంహౌజ్ లోకి ఇరిగేషన్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఫాంహౌజ్ లో సర్వే చేస్తున్నారు. భూమి కొలతలు చూస్తున్నారు అధికారులు. జన్వాడలో రూల్స్ కు విరుద్దంగా ఫాంహౌజ్ కట్టారనే ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. జన్వాడ ఫాంహౌజ్‌ను కూల్చివేయాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల సర్వేతో జన్వాడ ఫాంహౌజుకు బుల్డోజర్లు రానున్నాయనే చర్చ సాగుతోంది.

రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి మండలం జన్వాడలో కేటీఆర్‌కు చెందిన ఫామ్‌హౌజ్‌ను కూల్చేందుకు రేవంత్ సర్కార్ రంగం సిద్దం చేసిందని తెలుస్తోంది. నీటిపారుద‌ల శాఖ అధికారులు ఫాంహౌజ్ లో కొల‌త‌లు వేశారు. ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌ పరిధిలో ఫాంహౌజ్ ఉందా లేదా అని తేల్చారు. కవిత హైదరాబాద్ ఇంటికి వచ్చే సమయానికి కేటీఆర్ ఫాంహౌజుకు హూడ్రా బుల్డోజర్లు వెళ్తాయనే టాక్ నడుస్తోంది.

Back to top button