క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో సంచలనం రేపిన నోటుకు నోటు కేసులో కీలక పరిణామం జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని.. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ రెండు పిటీషన్లు దాఖలు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ కక్షలకు, సాధింపులకు కోర్టులు వేదిక కాదని.. వేదికలుగా మార్చొద్దంటూ పిటీషన్ దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరించింది జస్టిస్ సుందరేష్ ధర్మాసనం.
Read More : ఫాంహౌస్ బఫర్ జోన్‌లో ఉంటే దగ్గరుండి కూలగొట్టిస్తా…
చంద్రబాబును నిందితుడిగా చేర్చాలన్న పిటీషన్ ను.. అదే విధంగా సీబీఐతో విచారణ చేయాలన్న పిటీషన్ ను కూడా కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు.ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తీర్పు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపింది. చంద్రబాబు కడిగిన ముత్యం అని.. అతనిపై రాజకీయ కక్షతోనే కేసులు పెడుతున్నారని తమ్ముళ్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసిందని టీడీపీ నేతలు చెప్పారు.