తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే హైడ్రాకు చట్టభద్రత కల్పించారు.
Orr లోపల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీలు, 51 గ్రామ పంచాయితీలు హైడ్రా పరిధిలోకి వచ్చాయి. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కేటాయించింది. కోర్ హైదరాబాద్ కు చెరువులు, కుంటలు, నాళాలు, ftl, బఫర్ జోన్లలో కట్టిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
మహిళా యూనివర్సిటీ పేరు చాకలి ఐలమ్మ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ ఖరారు చేసేందుకు 12 మంది ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన యూనివర్సిటీలో ఖాళీల భర్తీ కోసం 3 వేల పోస్టులు మంజూరు చేసింది. ఎస్ఎల్బీసి పనులకు ఆమోదం తెలిపింది. సన్న వడ్లు పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
Slbcకి సంబంధించిన 4637 కోట్ల రూపాయల రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 2027 వరకు slbc పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.Slbc నుంచి ప్రతీ రోజు 4వేల క్యూసెక్కులు సంవత్సరానికి 30 టీఎంసీల నీళ్లు 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష ఎకరాలకు నీళ్లు రాలేదు.. కానీ slbc పనులకు 4 వేల కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని తెలిపారు. 40 కిలోమీటర్ల పనుల్లో ఇంకా 9 కిలోమీటర్లు సొరంగం పూర్తి చేయాల్సి ఉందని..
20 నుంచి 30 నెలల్లో పనులు పూర్తి అవుతాయన్నారు.