ఆంధ్ర ప్రదేశ్

ఏపీ మాజీ మంత్రి రోజా అరెస్ట్?

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ లీడర్ ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్దమైంది. రోజాతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో రోజా అరెస్ట్ కావడం ఖాయమని తెలుస్తోంది.

జగన్ మోహన్ రెడ్డి హాయాంలో అప్పటి ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం నిర్వహించింది. స్పోర్ట్స్ మినిస్టర్ గా రోజా ఇందులో కీలకంగా వ్యవహరించారు. అయితే ఈ క్రీడా కార్యక్రమంలో నిధులు దుర్వినియోగం కావడమే కాక, పక్కదారి పట్టినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లేలా వారు వ్యవహరించారని మాజీ మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఏపీ ఆత్యా – పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌ సీఐడీ డీఐజీకి ఈ ఫిర్యాదు చేశారు. ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్‌ కార్యక్రమాల పేరుతో క్రీడలశాఖ మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఫిర్యాదులో ఆరోపించారు. సీఐడీ విచారణ కోరుతూ సీఐడీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తాజాగా విచారణకు ఆదేశించడంతో రోజాకు కష్టాలు తప్పవని తెలుస్తోంది. మంత్రిగా ఉంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రోజా. వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు.

Back to top button