మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:
ఎలాంటి షరతులు లేకుండా నే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వర్తింపచేయాలని బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు చేరుకు లింగం గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లాంటివి కొన్ని డిమాండ్లు పెట్టడం వల్ల రైతులకు న్యాయం జరగదని ఏ స్కీం ద్వారా రుణం తీసుకున్న ఎప్పటినుంచి బ్యాంకుల్లో రుణాలు ఉన్న రైతులందరికీ కూడా తప్పనిసరిగా రెండు లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు చేస్తామని చెప్పి ఈరోజు వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఐటీలు లేనివారికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అని తప్పు పట్టారు. రైతు బంధు,రుణమాఫీ రైతు భరోసా మీద ఇప్పటికే రైతులు చాలా ఆశలు పెట్టుకున్నారని క్షణమే రైతు భరోసా వేయడంతో పాటు రెండు లక్షల రుణమాఫీ షరతులతో సంబంధం లేకుండా స్కీములతో సంబంధం లేకుండా కాలపరిమితి విధించకుండా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండు చేశారు. రైతులతో సమానంగా కౌలు రైతులను కూడా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని దాన్ని కూడా అమలు చేయాలన్నారు.
190 Less than a minute