పాలకుర్తిలో సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి సంచలనం స్పష్టించిన యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. సొంత పార్టీ నేతలే ఆమె తిరగబడుతున్నారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త, పాలకుర్తి కాంగ్రెస్ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డితో సొంత పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల్లో మీ కోడలు గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. దీంతో ఆమె చేసేది ఏమీ లేక వాహనం ఎక్కి అక్కడినుండి వెళ్లిపోయింది.
Read More : అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరా? స్టూడెంట్ ఫోన్‌లో వేలాది న్యూడ్ వీడియోలు
ఇటీవల కూడా కాంగ్రెస్ నేతలు అత్తకోడళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేసిన వారిని వదిలేసి కొత్తగా పార్టీలో చేరిన వారికి అందలం ఎక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదని.. సమస్యలు చెప్పుకుందామని వచ్చినా కలవడం లేదని ఆరోపించారు. పార్టీ నేతలు వచ్చినా ఇంటి లోపలికి అనుమతి ఇవ్వడం లేదని పాలకుర్తి కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గానికి రావడం లేదని చెబుతున్నారు.