తెలంగాణ

ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు మావోయిస్టుల వార్నింగ్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టులు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రాజకీయ నేతలను హెచ్చరిస్తూ లేఖలు విడుదల చేస్తున్నారు. ఇటీవలే కోల్ బెల్ట్ ఏరియాలోని బీఆర్ఎస్ నేతలకు తమ తీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తాజాగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సోదరుడు, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే వినోద్ అనుచరుల పని పడతామంటూ మావోయిస్టులు లేఖ పంపించారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ పేరిట లేఖ విడుదలైంది. గడ్డం వినోద్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టు పార్టీ కోల్ బెల్ట్ కార్యదర్శి ప్రభాత్. కొంతమంది నాయకులు గడ్డం వినోద్ పీఏ ప్రసాద్ అండదండలతో భూ కబ్జాలకు, అక్రమాలకు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ దేవయ్య అక్రమార్కులకు అన్ని విధాల వత్తాసు పలుకుతున్నారని చెప్పారు.

ఎమ్మెల్యే వినోద్ తో పాటు అతని అనుచరులు తక్షణం తమ పద్ధతులు మార్చుకోవాలని తమ లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. ఆక్రమించిన భూములను పేద ప్రజలకు, కార్మికులకు, రైతు కూలీలకు పంచాలని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. ఈ లేఖ స్థానికంగా కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కలవరంంగా మారింది. మావోయిస్టుల లేఖపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారా.. లేక బెదిరించడానికి ఎవరైనా ఫేక్ లెటర్ స్పష్టించారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button