ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. ప్రాణాలతో బయటపడ్డ రోగి

కాకినాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో అద్భుతం జరిగింది. రోగికి ఇష్టమైన సినిమా చూపిస్తూ క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్లు. రోగి ప్రాణాలు నిలబెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాని చూపిస్తూ “అవేక్ క్రానియోటమీ” ద్వారా మహిళా రోగికి బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించిన డాక్టర్లు.ఈ సర్జరీ చేసిన వైద్యులను అంతా అభినందిస్తున్నారు

తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన ఎ. అనంతలక్ష్మి (55) అనే మహిళ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుంది.బ్రెయిన్ ట్యూమర్‌ను తొలగించడానికి అవేక్ క్రానియోటమీ పద్దతిలో రోగిని మెలుకువలో ఉంచడానికి తనకు ఇష్టమైన అదుర్స్‌ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య కామెడీ సీన్లను చూపిస్తూ ఆపరేషన్ చేశారు.

రెండున్నర గంటల పాటు జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయింది.. మహిళ ఐదు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు. ఇలాంటి శత్రచికిత్స కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జరగడం.. విజయవంతం అవ్వడంతో డాక్టర్లను అందరూ అభినందించారు.

Back to top button