అంతర్జాతీయంజాతీయం
Trending

మహిళా పోలీస్ అధికారులతోనే మోడీకి భద్రత!… ఉమెన్స్ డే స్పెషల్.. ఇలాంటి డేరింగ్ ఏ దేశంలోనూ చేయరు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎవరూ చేయని సాహసం మన భారతదేశంలో చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేవలం మహిళా సిబ్బందితోనే భద్రతను కల్పించనున్నారు. రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రేపు గుజరాత్ రాష్ట్రంలోని నవ్సారీ జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఆయన తిరిగి మళ్లీ ఢిల్లీ వెళ్లే వరకు మొత్తం భద్రత అంతా కూడా కేవలం మహిళా పోలీసులు అలాగే మహిళా అధికారులు మాత్రమే పర్యవేక్షించుకున్నారు. ఇలాంటి ప్రయత్నం దేశంలోనే తొలిసారి అని ప్రపంచంలో కూడా ఇలాంటి సాహసం ఎవరూ చేయరని రాష్ట్ర హోం మంత్రి హర్ష సంఘవి స్వయానా తెలిపారు.

రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భద్రతా దృశ్య 2100 మంది కానిస్టేబుళ్లు, 187 మంది ఎస్ఐలు, 61 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది డిఎస్పీలు, ఐదుగురు ఎస్పీలు, ఒక డిజిపి ర్యాంక్ అధికారి నరేంద్ర మోడీకి భద్రతా దృశ్య పర్యవేక్షణలో ఉంటారు. కాబట్టి ఇలాంటి సాహసం అనేది మన దేశంలోనే మొట్టమొదటిసారి జరుగుతుంది. ఒక్క పురుష పోలీస్ అధికారి లేకుండా కేవలం మహిళ అధికారులతోనే ప్రధాని నరేంద్ర మోడీకి భద్రతను కల్పించనున్నారు. ఇటువంటి సంఘటన దేశంలో ఎప్పుడూ కూడా జరగలేదు. మొట్టమొదటిసారి మహిళ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక మహిళ కూడా ఇలాంటి సాహసాలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ స్వయానా ఇలాంటి ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. దేశంలోని ప్రతి మహిళ కూడా చాలా ధైర్యంగా ఉండాలని.. అన్ని రంగాల్లోనూ రాణించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క మహిళకు ఆదర్శంగా నిలిచేలా ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1.సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు… థియేటర్లను షేక్ చేస్తుంది!

2.అద్దంకి దయాకర్‌కు మళ్లీ షాక్.. ఎమ్మెల్సీ రేసులో జానారెడ్డి అనుచరుడు?

3.ఎలక్షన్ లో కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button