
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించాలి.. వాటికి సంబంధించిన షెడ్యూల్ ని కూడా త్వర త్వరగా పూర్తిచేస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో ఇక పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మెల్లిగా ఊపు అందుకుంటుంది. అనుకున్నట్టుగానే 50% లోపు రిజర్వేషన్లతో చాలా డెడికేటెడ్ కమిషన్ అనేది రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఒక నివేదిక అయితే ఇవ్వనుంది. ఆ తర్వాతనే ఎన్ని రిజర్వేషన్లు అనేది ఫైనల్ చేసి చివరికి గెజిట్ జాబితాను ఎలక్షన్ కమిషన్కు అందిస్తారు. ఇక మరోవైపు ఈ నెల చివర ఆఖరిలోపు ఎన్నికల షెడ్యూలు విడుదల చేయనున్నట్లు ప్రాథమిక సమాచారం. ఇక మొత్తం స్థానిక ఎన్నికలు డిసెంబర్ 25వ తేదీ లోపు మూడు విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా అంటే చాలా ఉత్కంఠంగా సాగాయి. మళ్లీ ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజలు అలాగే పార్టీ నాయకులు.. జోష్ లో ఉన్నారు.
Read also : జైల్లో వేస్తే డిప్రెషన్ కు గురువుతాను అనుకున్నారేమో… నేను తెలంగాణ ఆడబిడ్డని : కవిత
Read also : Viral News: వద్దన్నా ముద్దు పెట్టిన ప్రియుడు, నాలుక కొరికేసిన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్!





