ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులకు ఇంకా అందని జీతాలు.. దసరా పండగ ఎలా?

ప్రభుత్వం ఉద్యోగులను మురిపించి మోసం చేసిందనే వార్తలు వస్తున్నాయి. మొదటి రెండు నెలలు ఒకటో తారీఖు రోజే వేతనాలు ఇచ్చి గొప్పగా చెప్పుకున్న ప్రభుత్వం.. క్రమంగా సీన్ మార్చేసింది. అక్టోబర్ లో 6 తారీఖు వచ్చినా ఇంకా సగం మంది ఉద్యోగులకు జీతం రాలేదు. దీంతో ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. దసరా సెలవులు మొదలయ్యాయి. పండగ షాపింగ్ చేయాల్సి ఉంది. ఇంకా వేతనాలు రాకపోవడంతో ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. మొబైల్ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంకా స‌గం మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల‌కు జీతాలు ప‌డ‌లేదు. కూటమి సర్కార్ కొలువుదీరిన మొద‌టి నెల‌లో ఫస్ట్ తేదీనే వేతనాలు వేశారు. ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా మొదటి తారీఖు బ‌దులు మూడు, నాలుగు…ఇలా పెంచుకుంటూ 10వ తేదీ నాటికి సాలరీస్ ఇస్తున్నట్సు ఉద్యోగులు చెబుతున్నారు. సెప్టెంబర్ చివరలో ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. అయినా ఉద్యోగులకు జీతాలు వేయ‌లేదు. అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లోనే ఇలా వుంటే, రానున్న రోజుల్లో ఇంకెంత దారుణంగా వుంటుందో అని ఉద్యోగులు భ‌య‌ప‌డుతున్నారు.

 

 

Back to top button