తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు ప్రమోషన్ దకకింది. ఆయన ఇవాళ రాష్ట్ర ఉప మఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం స్టాలిన్ ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహస్తుననారు. ఇవాళ తమిళనాట మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ముఖ్యమంత్రి పంపిన ఈ ప్రతిపాదనకు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదం తెలిపారు.
గత కొద్ది రోజులుగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్ఠాలిన్ అవుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రచారాన్ని పలుమార్లు ఉదయనిధి స్టాలిన్ కొట్టిపారేశారు. కానీ, చివరకు ఆయన డిప్యూటీ సీఎంగా ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉద్యోగాల పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకున్నారు.