క్రైమ్తెలంగాణ

ఇరు వర్గాల మధ్య దాడి.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హైటెన్షన్

హైదరాబాద్ పాతబస్తీలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి రోడ్డుపై రెండు వర్గాలు హంగామా చేశాయి. కిషన్ కుమార్ రాజ్ పుత్ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టుపై వివాదం చెలరేగింది. ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ కిషన్ పెట్టిన పోస్టుపై అబ్దుల్ అక్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు పోలీస్ స్టేషన్ ముందు హంగామా చేశారు. దీంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. ఇదే విషయం బయటకు రావటంతో మరో వర్గం వారు రోడ్లపైకి వచ్చారు.

ఇరువర్గాలు పోటాపోటీగా ఆందోళనలు చేయడంతో రెయిన్ బజార్ లో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలను అక్కడినుంచి పంపించి వేయడానికి తీవ్రంగా శ్రమించారు. భారీగా అదనపు బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలిపారు డీసీపీ స్నేహ మిశ్రా తెలిపారు. ఇరువర్గాల వారు శాంతియుతంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని డీసీపీ హెచ్చరించారు.

Back to top button