ఇరిగేషన్ ఏఈఈ నికేష్ ఏసీబీ ట్రాప్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ చరిత్ర లోనే రెండో అతి పెద్ద ఆపరేషన్ గా నిలుస్తోంది. గండిపేట పరిధిలో బఫర్ జోన్ లో ఉన్న భూముల్లో నిర్మాణాలను అక్రమంగా పర్మిషన్స్ ఇస్తూ నికేష్ కుమార్ కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం ఏఈ నికేష్ కుమార్ ఆస్తి 600 కోట రూపాయలు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.
నికేష్ కుమార్ ఖరీదైన విలాలు, ఫాంహౌజ్ లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. వాసవి అట్లాంటిస్ నానక్ రామ్ గూడ, మైరాన్ విల్లా, బ్లిస్ శంషాబాద్, కపిల్ ఇన్ఫ్రా, సాస్ గచ్చిబౌలి, రాయిచాందినీ లో ఖరీదైన విల్లాలు గుర్తించారు. నార్సింగి లో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనంతో పాటు మొయినాబాద్ లో ఆరు ఎకరాల్లో మూడు ఫామ్ హౌస్ లు, తాండూర్ లో మూడెకరాల వ్యవసాయ స్థలం ఉన్నట్లు తేలింది. నికేష్ కుమార్ బంధువులు బినామీలకు చెందిన ఏడు లాకర్లను గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని సోమవారం తెరవనున్నారు.
నికేష్ కుమార్ తో పాటు బంధువుల నివాసంలో కిలో పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎసిబి అధికారులు. గతంలో ఏసీబీ ట్రాప్ అయిన సిసిఎస్ మాజీ ఏసిపి ఉమా మహేశ్వర రావు తో కలిపి నికేష్ కుమార్ సెటిల్మెంట్ లు చేసినట్లు గుర్తించారు. మే నెలలో నికేష్ కుమార్ ఏసీబీ ట్రాప్ తర్వాత లోతుగా దర్యాప్తు చేసింది ఏసీబీ. నికేష్ కుమార్ బినామీ ఆస్తులను గుర్తించే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆదాయానికి మించిన ఆస్తుల కేసుగా భావిస్తున్నారు ఏసీబీ. ఏసిబి చరిత్రలో టాప్ త్రీ కేసులు ఇది రెండోదిగా తేలింది. దేవికరాణీ తర్వాత ఇదే టాప్‌లో నిలుస్తుందని చెబుతున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
లిక్కర్ తాగేదాన ఉరికించి కొడతం.. కొండా సురేఖకు స్వేరో వార్నింగ్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్