క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : ఆడది చాలా పవర్ ఫుల్. అమె తలుచుకుంటే ఏదైనా చేస్తుందని అంటారు.ఆమె కోసం ఎంతకైనా దిగజారే వారు ఉంటారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే కోకొల్లలుగా చూశాం. ఆడదాని కోసం చిల్లర వేశాలు వేసేవారిలో చిన్నా పెద్ద, ధనిక- పేద తేడా ఉండదు. అమెరికా ప్రెసిడెంట్ లో ఆడదాని వలలో చిక్కుకుని అభాసుపాలయ్యారు. ఎంతో మంది తమ పదవులు కోల్పోయారు. సీఎం, మంత్రులు సైతం ఆడదాని విషయంలో రోడ్డున పడిన సందర్భాలు చూశాం. తాజాగా తన భార్య కోసం పాడుపని చేసిన ఓ సీఎం.. తన పదవికి గండం తెచ్చుకున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన సతీమణికి భూకేటాయింపు పరిహారం విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని కొంత మంది ఆరోపిస్తున్నారు.2021లో ముడా (మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. దీనికి ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు.అయితే.. ఈ భూమి.. విజయనగరంలో భూమి ధర.. కేసరెలో భూమి కంటే రెట్టింపు ఉందని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై తాజాగా, ఆర్టీఐ కార్యకర్త ఒక పిటీషన్ సైతం వేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో సీఎం సిద్దరామయ్య… ఈ వివరాలను పొందుపర్చలేదని కూడా ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం ప్రధానంగా ఆరోపణలు చేశారు.
Read More : కర్నాటక కాంగ్రెస్ సీఎం అవుట్.. నెక్స్ట్ రేవంత్ రెడ్డేనా?
సామాన్యులకు ఒకలా.. సీఎం సతీమణి కొన్న భూమికి మరోలా పరిహారం చెల్లించడం, అక్కడ భూమి రెట్లు కూడా రెట్టింపుగా ఉండటం వివాదానికి కేంద్ర బిందువుగామారింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త అబ్రహంతోపాటు మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా సీఎంపై కేసు ఘటన కావడంతో పోలీసులు.. గవర్నర్ ను కలిశారు. రాజ్యంగం ప్రకారం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సూచనల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.ముడా ల్యాండ్ స్కామ్, అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై విచారణకు అనుమతి ఇవ్వాలని కూడా ఫిర్యాదు దారుడు గవర్నర్ ను డిమాండ్ చేయడం సంచలనంగా మారింది.సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు, ముడా కమిషనర్‌పై కూడా కేసు నమోదు చేయాలని అబ్రహం తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నాడు.
Read More : హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి
ముడా స్కాంలో పోలీసుల విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో… సీఎంను కూడా విచారించాలనే డిమాండ్ వస్తోంది. మరోవైపు భార్య కోసం అక్రమాలు చేసిన సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ, జేడీఎస్ డిమాండ్ చేస్తోంది. సిద్దరామయ్యను దింపాలని చూస్తున్న కాంగ్రెస్ లోని ఓ వర్గం కూడా ఇదే అదనుగా పావులు కదుపుతుందని తెలుస్తోంది. ముడా స్కాం సిద్దరామయ్య పదవికి ఎసరు తెచ్చిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.