తమిళనాడులోని ప్రముఖ శ్రీ విల్లిపుత్తూరు ఆండాళ్ దేవాలయంలో సంగీత దర్శకుడు ఇళయరాజకు అవమానం జరిగింది. ఆలయం ఎదుట ఉన్న అర్థ మండపం నుంచి ఇళయ రాజాను బయటకు పంపేసిన ఘటన సంచలనంగా మారింది.
విరుదునగర్ జిల్లాలోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. విష్ణుమూర్తి 108 దివ్యదేశాల్లో ఇది కూడా ఒకటి. ఇళయరాజా.. స్వామి వారి దర్శనం కోసం అక్కడకు వెళ్లారు. అయితే శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ గర్భగుడి ముందు ఉన్న అర్థ మండపంలోకి ప్రవేశించడానికి ఇళయ రాజా ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న జీయర్ ఆయనను అడ్డుకున్నారు. దీంతో అర్థ మండపం మెట్ల దగ్గర నిలబడి ఇళయరాజా ఆలయ మర్యాదలను స్వీకరించారు. ఎన్నో పాటల్లో స్వామిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.