
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :– హైదరాబాద్ సిటీలోని పలు అక్రమాలను తాజాగా హైడ్రా తొలగిస్తుంది. ఇవాళ హైడ్రా ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అవసరమైన చర్యలను తీసుకుంటున్నారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో బుధవారం సిటీలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించారు. తాజాగా మల్కాజిగిరి సర్కిల్ సైనిక్‌పురి ఆర్మీ ఆఫీసర్ల కాలనీ వెళ్లకుండా అడ్డుగా నిర్మించిన 50 మీటర్ల ప్రహరీని హైడ్రాధికారులు తొలగించేశారు. మరోవైపు శంషాబాద్ మండలం రాళ్లు గూడ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు వెళ్లకుండా అడ్డుగా నిర్మించిన 155 మీటర్ల ప్రహరీని హైడ్రాధికారులు కూల్చివేశారు. దీంతో రాలగూడ తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయి.
Read More : కాంగ్రెస్ నాయకుల అహంకారమే!… INDIA కూటమికి ఓటములు?
నిజాంపేట రోడ్ లోని హోలిస్టిక్ ఆసుపత్రి వెనక ప్రభుత్వ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహరీని హైడ్రా అధికారులు తొలగించారు. అదే స్థలంలో తనకు కేటాయించిన 300 గజాల ఇంటి స్థలం ఉందని, అది కబ్జా కు గురైందని మాజీ సైనికుడు ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిగింది. దీంతో హైడ్రాధికారులు వెంటనే స్పందించి తొలగించారు మాజీ సైనికుడు భూమిని ఆయనకు తిరిగి అప్పగించారు.
Read More : కొత్త జెర్సీలో టీమిండియా ఆటగాళ్లు!… చాలా క్లాసిక్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు?