నైరుతి బంగాళాఖాతంలో బలపడిన ఫెయింజల్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికిస్తోంది. తుఫాన్ పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మధ్యాహ్నానికి పాండిచెరీ, తమిళనాడులోని మహాబలిపురం మధ్యలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఆ సమయంలో తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది.
ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు , దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మికంగా వరదలు వచ్చే ప్రమాదముందని అలర్ట్ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సముద్రం అలజడిగా మారడంతో సోమవారం వరకు వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది.
కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబరు ప్రమాద హెచ్చరక.. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను ప్రభావంతో తమిళనాడులోని ఏడు జిల్లాలకు రెడ్‌అలెర్ట్ జారీ చేశారు. నాగపట్నం, మయిలాడుదురై, తిరువారూరు, కడలూరు, తంజావూరు, విళుపురం జిల్లాలకు విపత్తు నిర్వహణ దళాల్ని పంపించారు.
మరిన్ని వార్తలు చదవండి…
బన్నీ కోసం రంగంలోకి పవన్.. సంబరాల్లో మెగా ఫ్యాన్స్
జీ న్యూస్ రిపోర్టర్‌పై జనసేన ఎమ్మెల్యే హత్యాయత్నం!.. పవన్ సీరియస్
అల్లు అర్జున్ పై సెటైరికల్ ట్వీట్ చేసిన ఆంధ్ర ఎంపీ?… అసలు ఏమైందో తెలుసా?
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్