తెలంగాణ

అయోధ్య బాలరాముడితో గణపయ్య..బడా గణేష్ ఈసారి వెరీ స్పెషల్

దేశవ్యాప్తంగా వినాయకచవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వాడవాడలా బొజ్జ గణపయ్యలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడ చూసిన వినాయక విగ్రహాల సందడే కనిపిస్తోంది. వినాయక చవిత అనగానే దేశవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. ప్రతి ఏటా ప్రత్యేక ఆకారంలో మహా గణనాథుడిని ప్రతిష్టిస్తుంటారు.

ఖైరతాబాద్ వినాయకుడు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహకులు ఈసారి 70 అడుగుల ఎత్తులో గణనాథుడిని ప్రతిష్ఠించారు.శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా బడా గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నాడు. పర్యావరణహికంగా గత రెండేళ్లుగా పూర్తిగా మట్టితోనే ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేస్తున్నారు. పూర్తిగా మట్టితో కూడిన ఎకో ఫ్రెండ్లీ గణనాథుడిని రూపొందించారు.

మహాగణపతికి రెండు వైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ప్రతిష్టించారు. గణపయ్య పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహన్ని ఏర్పాటు చేశారు.

బడా గణనాథుడి విగ్రహా తయారీలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 190 మంది కళాకారులు పాల్గొనారు. గణపయ్య విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. గతేడాది బడా గణేష్ ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఈ మేరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

 

Back to top button