క్రైమ్

అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్ కెమెరా? ‌స్టూడెంట్ ఫోన్‌లో వేలాది న్యూడ్ వీడియోలు

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ లో అమ్మాయిల బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టిన ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. ఆ ఘటన మరవకముందే కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. మైసూరు రోడ్డులోని కంబీపూర్‌లోని ఏసీఎస్ కాలేజీ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డాయి. హైడెన్ కెమెరాలను గుర్తించిన కొంత మంది అమ్మాయిలు.. వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమ్మాయిలు ఆందోళనకు దిగారు. స్టూడెంట్స్ ఆందోళనతో కాలేజీకి వచ్చిన పోలీసులు.. బాత్రూంలో అమర్చిన హిడెన్ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.

కుశాల్ అనే ఇంజనీరింగ్ ఫైనలియర్ స్టూడెంట్ ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. కుశాల్ మొబైల్స్, ల్యాప్ టాప్ పరిశీలించగా.. వేల కొలది అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ఘటన కర్నాటకలో పెద్ద దుమారం రేపుతోంది. పోలీసులు కుశాల్ ను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థినుల పేరెంట్స్ కాలేజీకి వచ్చి నిరసన చేశారు. కాలేజీ యాజమాన్యంపై మండిపడ్డారు. కాలేజీలో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. అటు కాలేజీ యాజమాన్యం మాత్రం బాత్రూంలో ఎలాంటి సీక్రెట్ కెమెరాలు దొరకలేదని చెప్పారు. అనుమానంతోనే విద్యార్థులు ఆందోళనకు దిగారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Spread the love
Back to top button