
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది వైసీపీ నాయకులు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. మొన్న అంబటి రాంబాబు అమరావతిలో పడుతున్న వర్షాలకు అక్కడ బోటు జర్నీ చేయవచ్చని ఎద్దేవా చేశారు. నేడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత హైలెట్గా నిలిచాయి. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజాగా రాజధాని అమరావతి గురించి మాట్లాడుతూ సెటైర్లు వేశారు. రెండు మూడేళ్లలో అమరావతిలో పులస చేపలు పడతాం.. మీ అందరికీ కూడా త్వరలోనే పంచి పెడతామని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ గోదారి నది ఎలా పొంగిపొర్లుతుందో… అక్కడ రాజధాని లో కూడా వరద నీరు అలా పొంగిపోతుంది అని హాస్యంగా వ్యాఖ్యానించారు. అలాగే చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని మొదటి నుండి మానసికంగా కుంగిపోయేలా చేస్తున్నారని అన్నారు.
Read also : ట్రాఫిక్ జాం ఉన్నా టోల్ ఎందుకు కట్టాలి, సుప్రీం సూటి ప్రశ్న!
ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం అమరావతి పనులు సక్రమంగా జరుగుతున్నాయని… త్వరలోనే రాష్ట్రానికి రాజధాని అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. కొంతమంది వైసీపీ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. ఎవరు ఎన్ని వ్యాఖ్యలు చేసిన కూడా.. ఈ వ్యాఖ్యలన్నీ కూడా తిప్పికొట్టేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోనే లేనటువంటి విధంగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఈ సందర్భంలోనే ప్రతిపక్ష పార్టీ వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకతను తెచ్చేందుకు తెగ ప్రయత్నం చేస్తున్నారు.
Read also : సిద్దిపేటలో విషాదం.. కరెంట్ షాక్‌కు తండ్రి కొడుకులు మృతి